అతడిని పట్టిస్తే 7 లక్షలు..?
1 min readపల్లెవెలుగు వెబ్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ బెటాలియన్-1 చీఫ్ అయిన హిడ్మా మీద ఎన్ఐఏ రివార్డు ప్రకటించింది. హిడ్మాను పట్టిస్తే 7 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. ఇటీవల సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో పోలీసుల మీద జరిగిన దాడిలో హిడ్మా ప్రధాన పాత్ర పోషించినట్టు ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ మావోయిస్టు హిడ్మా మీద రివార్డు ప్రకటించింది. హిడ్మా మీద ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. ఇటీవల చత్తీస్ఘడ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఎన్ఐఏ ఈ రివార్డును ప్రకటించింది.