ఇరు గ్రామాల మధ్య 70 ఎకరాల చెపల చెరువు వివాదం..
1 min read– పరిష్కారం కానీ పంచాయితీ..ప్రజా ప్రతినిధుల మధ్య పరిష్కరించుకుందాం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు మండలం కోమటి లంక శ్రీపర్రు గ్రామాల మధ్య ఏళ్ళ తరబడి వివాదం గా ఉన్న 70 ఎకరాల చేపల చెరువుల వివాద పంచాయతీ ఏలూరు మండల పరిషత్ కార్యాలయానికి సోమవారం చేరింది. గతం లో టి డి పి అధికారం లో ఉండగా కోమటి లంక గ్రామ పరిధిలో ఉన్న 70 ఎకరాల భూమిలో అప్పటి టి డి పి ప్రజా ప్రతినిధి ఒకరు చేపల చెరువు తవ్వారు.అప్పట్లో ఆ చెరువు తవ్వకం ఉద్రిక్తతలకు దారి తీసింది.టి డి పి తవ్విన 70 ఎకరాల చేపల చెరువులో శ్రీపర్రు గ్రామస్తులను కూడా వాటా దారులుగా చేర్చారు.అప్పటి నుండి కోమటి లంక .శ్రీపర్రు గ్రామాల మధ్య 70 ఎకరాల చేపల చెరువు వివాదం నీవురు గప్పిన నిప్పులా మారింది. ఈ వివాదాన్ని ఏదోలాగైనా పరిష్కరించాలని భవిష్యత్ లో ఇరు గ్రామాల మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తకుండా టి డి పి. వై సి పి వర్గాల మధ్య శాంతి సామరష్యాలు నెలకొల్పాలని అధికార వై సి పి నాయకులు నిర్ణయించారు. రెండు గ్రామాల పెద్దల ను ఒక తాటి పైకి తెచ్చారు.రెండు గ్రామాల మధ్య ఏర్పడిన చెరువు వివాదం పరిష్కరించుకునేందుకు ఏలూరు మండల పరిషత్ సమావేశ మందిరం వేధికగా చేసుకుని నాలుగు గోడల మధ్య సామరస్యంగా పరిష్కరించుకుందామని సోమవారం శ్రీపర్రు.కోమటి లంక గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. .సుమారు 3 గంటల పాటు రెండు గ్రామాల పెద్దల మధ్య జరిపిన చర్చలు ఫలించలేదు.కోమటి లంక లో అక్రమం గా తవ్విన చేపల చెరువులలో శ్రీ పర్రు గ్రామానికి సంబంధం లేదని మా గ్రామానికి చెందిన చెరువులో వాటాలు ఇచ్చేది లేదని కోమటి లంక గ్రామ పెద్దలు సమావేశం లో పాల్గొన్న పెద్దలకు తేల్చి చెప్పడం తో ఈ పంచాయతీ ఇక్కడ తెగదని భావించిన ఇరుగ్రామాల పెద్దలు ఈ వివాదాన్ని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి వద్ద తేల్చు కుండామని నిర్ణయించుకుని సమావేశాన్ని సామరస్యంగా ముగించారు. .ఈ వివాద0 వెనుక అసలు కారణాలు ఇలా ఉన్నాయని తెలిసింది.టి డి పి అధికారం లో ఉండగా అప్పటి ప్రజా ప్రతినిధి ఒకరు కోమటి లంక గ్రామం లో సుమారు 70 ఎకరాల భూమిని ఆక్రమించి దౌర్జన్యంగా చేపల చెరువులు తవ్వి నట్టు తెలిసింది.ఈ చెరువులో శ్రీపర్రు గామస్తులకు కూడా వాటా ఉందని కొంత మంది శ్రీపర్రు గ్రామస్తులను అడ్డు పెట్టుకుని 70 ఎకరాలలో చెరువు తవ్వారనేది సమాచారం.టి డి పి అధికారం కోల్పోయాక ఆ 70 ఎకరాల చేప ల చెరువులపై వచ్చే ఆదాయాన్ని శ్రీపర్రు గ్రామానికి కూడా పంచాలంటూ పట్టు బట్టినట్టు సమాచారం. టి డి పి ప్రజా ప్రతినిధి చేసిన పనికి కోమటి లంక 70 ఎకరాలలో వచ్చే ఆదాయ0లో సగం కోల్పోవాల్సి వచ్చిందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోమటి లంక గ్రామం లో ఉన్న కుటుంబాలు వై సి పి. టి డి పి వర్గాలుగా గా విడిపోయి ఈ వివాదం పై అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ .ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని వినతి పత్రాలు కూడా అందజేశారు.అప్పట్లో వై సి పి అధికారం లో లేక పోవడం తో గత్యంతరం లేక అధికారం లో ఉన్న టి డి పి ప్రతి పాదన ఎదురించి న్యాయ పోరాటానికి దిగినా ఫలితం లేదని అప్పట్లోనే కోమటి లంక వై సి పి వర్గం వాపోయినట్టు తెలిసింది. టి డి పి అధికార బలం తో కోమటి లంకలో తవ్విన 70 ఎకరాల చేపల చెరువుల్లో .శ్రీపర్రు గ్రామానికి50 శాతం వాటా ను కోమటి లంక గ్రామ0 ఒప్పుకోక పోయినా బలవంతంగా శ్రీపర్రు గ్రామానికి 50 శాతం వాటా ఉందంటూ లోలోపల వాడిస్తూనే వివాదాలకు తావు లేకుండా వాటాలు పంచుకుంటున్నట్టు సమాచారం. ఈ వివాదం అప్పటి నుండి రెండు గ్రామాల మధ్య అంతర్గతం గా అప్పుడప్పుడు చిచ్చు రేపుతున్నట్టు సమాచారం. అయినప్పటికీ లంక గ్రామాల గుట్టు బయటకు పొక్క కుండా ఉండాలనే సాంప్రదాయం గుండెల నిండా నింపుకుని రెండుగ్రామాలు కడుపులో కత్తులు పై కి చిరు నవ్వులు చిందిస్తూ స్నేహంగానే సాగిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఆ నాటి నుండి నేటి వరకు కోమటి లంక గ్రామానికి చెందిన చెరువుల్లో వచ్చే ఆదాయాన్ని శ్రీపర్రు గ్రామానికి సగం పంచుతున్నట్టు సమాచారం.శ్రీపర్రుకు సగం వాటా పంచె పద్ధతిని కోమటి లంక జీర్ణించుకోలేక పోతున్నట్టు సమాచారం. కోమటి లంక గ్రామం లో వాటాదారులు పెరిగినా వారికి చేపల చెరువుల ద్వారా వచ్చే ఆదాయం పంచలేక పోతున్నామని శ్రీపర్రుకు పంచె ఆదాయాన్ని నిలిపి వేసి గ్రామానికి పూర్తి స్థాయిలో వాటాలు పంచుకునే అవకాశం ఉంటుందని కోమటి లంక పెద్దలు అభిప్రాయం పడుతున్నట్టు సమాచారం..ఈ వివాదానికి తెర దించి శ్రీపర్రు.కోమటి లంక గ్రామాల మధ్య స్నేహ పూరిత వాతావరణం నెలకొల్పి రెండు గ్రామాల ప్రజలు సంతోషంగా ఉండేందుకు దెందులూరు ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి ఆద్వర్యం లో ఈ వివాద పరిష్కారం లో శ్రీపర్రు.కోమటి లంక గ్రామాల్లో శాంతి సంతోషం సౌబ్రాతృత్వం కలిగి ఉండే విధం గా ఉండాలని రెండు గ్రామాల ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.