ఆలమూరులో పట్టుబడిన 70 బస్తాల రేషన్ బియ్యం
1 min read– అక్రమ వ్యాపారులపై కేసు నమోదు చేయడంలో తలమునకలైన పోలీసులు…
– రెవెన్యూ అధికారులకు అప్పగించడంలో పోలీసుల నిర్లక్ష్యం…
– బియ్యం బస్తాలకు గ్రామ సేవకులు కాపలా…
పల్లెవెలుగు వెబ్, రుద్రవరం: మండలంలోని ఆలమూరు గ్రామంలో అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు అక్రమ రవాణా సాగించేందుకు సిద్ధంగా ఉంచిన 70 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగించేందుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై రాజ కుల్లాయప్ప సిబ్బందితో వెళ్లి బుధవారం మధ్యాహ్నం దాడి చేసి అక్రమ రవాణా సాగించేందుకు సిద్ధంగా ఉన్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు అందించే బియ్యాన్ని కొందరు వ్యక్తులు అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ రాజ కుళ్లాయప్ప రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అయితే తే.గీ మధ్యాహ్నం పట్టుబడిన బియ్యం బస్తా లకు సంబంధించి రాత్రి ఎనిమిది అవుతున్నా బియ్యం బస్తా లకు సంబంధించి పంచనామా రాయడంలో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడంలో తలమునకలవుతున్నట్లు తెలిసింది. ఎస్సై పంచనామా పూర్తి చేయకపోవడంతో రెవెన్యూ అధికారులు తల పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన బియ్యం బస్తాలకు సంబంధించి గ్రామానికి చెందిన కొండయ్య శెట్టి, అమరావతి ప్రసాద్ శెట్టి అనే వ్యక్తులు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. అక్రమ రవాణాకు సంబంధించిన వ్యక్తుల పై కేసు నమోదు చేయడంలో తలమునకలైన పోలీసులు పట్టుబడిన బియ్యం బస్తాలు రెవెన్యూ అధికారులకు అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన రేషన్ బియ్యానికి పోలీసులను కాపలా ఉంచకుండా గ్రామ సేవకులను కాపలాగా ఉంచినట్లు సమాచారం. గ్రామంలో పంచనామా పూర్తి చేయడంలో ఆలస్యం అవుతుందని పంచనామా పూర్తిచేసేందుకు పోలీస్ స్టేషన్ కు పోలీసులు చేరుకున్నట్లు తెలుస్తోంది. బియ్యం అక్రమ రవాణా సాగించే వ్యక్తుల పై కేసు నమోదు చేయడంలో పోలీసులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.