NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పందన కార్యక్రమానికి 70 ఫిర్యాదులు : జిల్లా ఎస్పీ

1 min read

ల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం (07-11-202 ) నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్ గారు 70 ఫిర్యాదులను స్వీకరించారు.సందర్భంగా జిల్లా నలుమూలల నుండీ విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేదంటే చర్యలు తప్పవని ఆదేశించారు .చట్ పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని,స్పందన పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటానని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఫిర్యాదులలో కొన్ని…APCOS (Andra pradesh Corporation For Outsourced Service ) లో ఉద్యోగం ఇప్పిస్తానని 47,500 డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా ప్రకాశం జిల్లా పామూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి మోసం చేసినారని ఇలాగే చాలామందిని మోసం చేశారని నందికొట్కూర్ కు చెందిన P.ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన పూజ్యనారాయణ నుంచి ట్రాక్టర్ ను మరియు ట్రాలీని T. యేసన్న కొన్నాడని కానీ కొర్రపాడు గ్రామానికి చెందిన గోపాల్ మరియు రాముడు అను వ్యక్తులు ట్రాక్టర్ ను తీసుకొనిపోయినారని ఎందుకు నా ట్రాక్టర్ ను తీసుకొని పోయినారు అని అడగగా పూజ్యనారాయణ కొడుకు అప్పు ఉన్నందున తీసుకొని పోయినామని చెప్పినారు. కావున నాయందు దయఉంచి నా ట్రాక్టర్ నాకు ఇప్పించగలరని చాగలమర్రి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏసన్న ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు, నంద్యాల టౌన్ డిఎస్పి మహేశ్వర్ రెడ్డి గారు , ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఎస్సై కల్పన గారు పాల్గొన్నారు.

About Author