70,180 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం: రాష్ట్ర సరిహద్దు… పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్, లోకల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా TS 15 UB 2464 బొలెరో టర్బో ట్రక్ వాహనంలో భారీగా గుట్కా సంచులు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ రవిచంద్ర, ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎస్పీ డా.ఫక్కీరప్ప, సెబ్ ఏఎస్పీ గౌతమి సాలి ఆదేశానుసారం… పంచలింగాలచెక్ పోస్టు వద్ద శనివారం సెబ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా… TS 15 UB 2464 బొలెరో టర్బో ట్రక్ వాహనం లో అనుమానం రాకుండా, కనపడకుండా, ఖాళీ ట్రేస్ ల మద్యలో 174 సంచుల్లో మొత్తం 70,180 గుట్కా ouches(ప్యాకెట్లు)ల ను పెట్టుకొని తరలిస్తుండగా పట్టుకున్నారు. గుట్కా సంచులను కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రకాశం జిల్లా అద్దంకి కు తరలిస్తున్నట్లు బొలెరో డ్రైవర్ మహమ్మద్ హైదర్ అలీ తెలిపాడు. వీటి మార్కెట్ విలువ సుమారు 6.5 లక్షలు వుంటుంది. తదుపరి చర్య నిమిత్తం ముద్దాయిని గుట్కా సంచులను,బొలెరో వాహనాన్ని , కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ కు అప్పగించ డమైనది. దాడుల్లో SEB హెడ్ కానిస్టేబుల్ ఖాజా, మురళి , షరీఫ్, శ్రీనివాసులు, SPO సుందర్,సలీం,తిరుపాల్ రెడ్డీలు పాల్గొన్నారు.