ఘనంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read– జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే కాటసాని
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణ గ్రామ పంచాయతీ కార్యాలయం లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఎగురవేశారు. ఆనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశం ఆంగ్లేయుల దాస్య శుంఖాల నుంచి విముక్తి పొంది భారత దేశంలో జీవించే ప్రతి ఒక్క పౌరునికి స్వేచ్ఛగా జీవించడానికి ఎంతో మంది మేధావులు అంకిత భావంతో భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు ఈ రోజు అని అందుకే భారత దేశం అంతా ఈ రోజు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అని చెప్పారు.అలాంటి రాజ్యాంగాన్ని నేటికీ అమలు అవుతున్నాయి అని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి మీద చట్టాలు కటినంగా వ్యవహరించడం జరుగుతుంది అని చెప్పారు.బనగానపల్లె పట్టణం లో ప్రతి రోజూ పారిశుధ్య పనులను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఈఓ ఖలీల్ కు నేడు ఉత్తమ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది అని చెప్పారు.అదే స్ఫూర్తి తో అందరూ కలిసి కట్టుగా పని చేస్తే సాధించలేనిది అంటూ ఎది వుండదు అని చెప్పారు.పట్టణం లోని పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎంతో శ్రమతో వారి విధులను నిర్వహిస్తున్నారు అని వారి సేవలనుకొనియాడారు.బనగానపల్లె ప్రజలందరికీ 74 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.