బీసీల.. రూ.75వేల కోట్లు దారి మళ్లించారు: టీజీ భరత్
1 min readబీసీలు ఎదిగింది తెలుగుదేశం పార్టీలోనే..
- కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్
- రాంబొట్ల దేవాలయం వద్ద జయహో బీసీ సభ
కర్నూలు, పల్లెవెలుగు: వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీలకు చెందిన 75 వేల కోట్ల రూపాయలు దారిమళ్లించారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అధ్యక్ష్యతన జయహో బీసీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి.జి భరత్‌తో పాటు మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప, టిడిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ బీసీలకు సరైన గౌరవం, గుర్తింపు తెలుగుదేశం పార్టీయే ఇచ్చిందన్నారు. ఈ ప్రభుత్వంలో పేరుకే 56 కార్పోరేషన్లు ఉన్నాయని.. నిధులు మాత్రం ఏమీ లేవన్నారు. అప్పట్లో కార్పోరేషన్ చైర్మన్లకు ప్రత్యేక విలువ ఉండేదన్నారు. ఇప్పుడు పదవులు ఉన్నా.. పవర్ లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇక కర్నూల్లో 80 వేల ఓటు బ్యాంకు బీసీలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఏకం కావాలన్నారు. భవిష్యత్తులో కర్నూల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడితే ఒక సీటు బీసీలకు ఇచ్చేంత ఐక్యత బీసీలు చూపించాలన్నారు. మతాల బేధం లేకుండా అంతా కలిసి జీవిస్తున్న కర్నూల్లో కొందరు రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక నగరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా హారతిచ్చిన ఓ బీసీ వ్యక్తికి చెందిన కూరగాయల దుకాణాన్ని తీసివేశారని గుర్తు చేశారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అనంతరం నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ వైసీపీ ఓట్ల కోసం బీసీలను వాడుకుందన్నారు. మళ్లీ టిడిపి వస్తే బీసీలకు సముచిత గౌరవం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత అర్షద్, కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, కర్నూలు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామక్రిష్ణుడు, కార్పోరేటర్లు విజయకుమారి, పరమేష్, నేతలు శివరాజ్, సుబాష్, రాజు యాదవ్, సంజీవలక్ష్మి, ముంతాజ్ బేగం, దాసెట్టి శ్రీనివాసులు, తిరుపాల్ బాబు, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, నందిమదు, ఊట్ల రమేష్, బాలు, చెన్న, అమర్నాథ్ గౌడ్, మహేష్ గౌడ్, ఎల్లప్ప, విక్రమ్ సింగ్, శివ, వెంకట్రాముడు, టి.జి శ్రీనివాసులు, శ్రీనివాసులు, అయాత్ బీ, రేష్మాబాయి, యూ.సి. వెంకటేష్, ప్రభాకర్, వెంకటేష్, ఎల్లగౌడ్, ఉమామహేశ్వరి, నాగేశ్వరి, అయ్యన్న, సుబ్బారావు, టి.జి రమేష్, చంద్రకాంత్, సుబ్బారావ్, చెంచన్న, ముంతాజ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.