PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7,500 కోట్ల భారీ జ‌రిమానా..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సూయిజ్ కాలువ‌లో ఇరుక్కుపోయిన ఎవ‌ర్ గివెన్ నౌక‌కు భారీ జ‌రిమాన ప‌డింది. 7500 కోట్ల జ‌రిమానా చెల్లించాల‌ని ఈజిప్టు న్యాయ‌స్థానం తీర్పు ఇచ్చింది. ఎవ‌ర్ గివెన్ నౌక యాజమాన్యం ఇంత భారీ మొత్తంలో జ‌రిమానా చెల్లించేందుకు సుముఖ‌త వ్యక్తం చేయ‌లేదు. దీంతో నౌక‌ను ఈజిప్టు ప్రభుత్వం జ‌ప్తు చేసింది. జ‌రిమానా చెల్లించేంత వ‌ర‌కు నౌకను క‌ద‌ల‌నివ్వమ‌ని తేల్చి చెప్పింది. సూయిజ్ కాలువ‌లో అడ్డంగా ఇరుక్కుపోయిన కార‌ణంగా ప్రపంచ వాణిజ్యం భారీగా దెబ్బతింది. దీంతో ఈజిప్టు న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవ‌ర్ గివెన్ నౌక ఇరుక్కుపోయిన కార‌ణంగా వంద‌లాది నౌక‌లు నిలిచిపోయాయి. సూయిజ్ కాలువ నుంచి బ‌య‌టికి తీసుకురావ‌డానికి భారీగానే ఖ‌ర్చు అయింది. ఈ నేప‌థ్యంలో ఎవ‌ర్ గివెన్ నౌకను క‌దిలించ‌డానికి అయిన ఖ‌ర్చు, మిగిలిన నౌక‌లు నిలిచిపోయిన కార‌ణంగా వ‌చ్చిన న‌ష్టాన్ని అంచనా వేసి.. ఆ న‌ష్టాన్ని ఎవ‌ర్ గివెన్ నౌక యాజ‌మాన్యానికి ఈజిప్టు న్యాయ స్థానం జ‌రిమానా విధించింది.

About Author