PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ బిల్డింగ్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

1 min read

ప్రతి ఒక్క ఉద్యోగి రాజ్యాంగాన్ని కట్టుబడి పని చేయాలి..

టి కృష్ణ డిప్యూటీ డైరెక్టర్ ఖజానా శాఖ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : గణతంత్ర దినోత్సవ వేడుకలు ను జిల్లా ఖజానా అధికారులు ,ఉద్యోగులు సమక్షంలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ బిల్డింగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  టి.కృష్ట , డిప్యూటీ డైరెక్టర్, ఖజానా శాఖ   జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి యొక్క ఉద్యోగి రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేయాలని, తమకు కేటాయించిన పనిని పూర్తి నిబద్ధతతో చేసినప్పుడే రాజ్యాంగ ఫలాలను భావితరాలకు అందించినవాళ్ళమవుతామని ఎందరో మహానుభావులు, మేధావులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి దేశ భవిష్యత్తు కోసం మన రాజ్యాంగ రచన చేశారు అని.రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని అన్నారు.ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి  కప్పల సత్యనారాయణ  మాట్లాడుతూ రాజ్యాంగoను అంబేద్కర్ ఒక్కరే వ్రాయలేదని ,కానీ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ గా రాజ్యాంగానికి ఒక తుది రూపు తేవడానికి, హేమాహేమీలు సభ్యులు గా ఉన్న ముసాయిదా కమిటీకి ప్రతి ఆర్టికల్ గురించి దానిని వ్రాసిన వారికంటే అంబేద్కర్ గారే  తన అపారమైన తెలివితేటలు తో,  నైపుణ్యాన్నంతో ఎంతో ఓపికతో చక్కగా ,సవివరంగా వివరించి రాజ్యాంగానికి తుది రూపు ఇచ్చారని.2 సంవత్సరాల 11 నెలలు ఆయన పడ్డ శ్రమ అసామాన్యం అని. సామాన్య పౌరుడు కి రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కే కనుక లేకపోతే నేడు దేశం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నరు.అదే రాజ్యాంగ గొప్పతనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో  అధికారులు ,ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author