NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీకి 76000 కోట్లు !

1 min read
ప‌ల్లెవెలుగువెబ్: సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీకి కేంద్ర ప్ర‌భుత్వం భారీ ప్రోత్సాహ‌కాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్ప‌త్తికి ముందుకు వ‌చ్చే కంపెనీల‌కు 76000 కోట్లు పీఎల్ఐ స్కీమ్ కింద కేటాయించాల‌ని సూచించింది. ఈ నిర్ణయంతో వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో దేశంలోకి రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 1.35 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు కేంద్ర ఐటీ, టెలికం శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌  వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలో సెమీకండక్టర్‌ చిప్‌లు, వాటి అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు, ఉత్పత్తి విలువ ఆధారంగా వచ్చే ఐదేళ్లలో కొన్ని పరిమితులకు లోబడి నికర అమ్మకాల విలువలో నాలుగు నుంచి ఆరు శాతం ప్రత్యేక ప్రోత్సాహంగా అందిస్తారు. 

About Author