జిల్లా పోలీస్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read– ఘనంగా ఘనంగా నిర్వహించిన… అడిషనల్ ఎస్పి G.వెంకటరాముడు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించిన జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి వెంకటరాముడు .ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. వెంకటరాముడు గారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం అని వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందున్న భావితరాలకు జాతీయ సమైక్యతను చాటుతూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని తెలియజేశారు. అనంతరం నంద్యాల జిల్లాలోని పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా ప్రజలకు ఉన్నతాధికారులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.