కర్నూలు అర్బన్ లో …78 డెంగు కేసులు నమోదు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సరస్వతి మరియు నిత్య పూజయా ఎంపీహెచ్ఈఓ కడప జోనల్ కార్యాలయం నుంచి కర్నూలుకు వచ్చి డెంగు కేసులు నమోదు అయిన చోట్ల ముజఫర్ నగర్ మరియు శ్రీరామ్ నగర్ నందు పర్యటించారు. కర్నూలు అర్బన్ నందు 78 కేసులు డెంగు పాజిటివ్ నమోదు అయినందున వారి విజిట్ చేసి మలేరియా టీం ఏం చర్యలు తీసుకున్న రూఆరాతీశారు ముఖ్యంగా కేసులు వచ్చిన చోట ఆంటీ లార్వా ఆపరేషన్ మరియు ఫాగింగ్ చర్యలు తీసుకున్నారు లార్వా ఉన్నచోట సర్వే చేసి ఆబిట్ ను పిచికారి చేశారు మరియు ఆ ప్రాంతం అంతయు రాండం మెథడ్ లో సర్వే చేశారు వారికి ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగినది బాత్రూంలో విడిచిన బట్టలు ఉంచకూడదని నీటి నిలువలు ఉండకూడదని వారానికి ఒకసారి నీరు అంతా పారపోసి శుభ్రపరచుకొని తొట్లలో నీరు నింపుకోవాలని తెలిపారు ముఖ్యంగా దోమలు లార్వా ప్రబలకుండా చూసుకోవాలని మురికి కాలువలు దిబ్బలు ఎత్తించాలని పంచాయతీ వారితో ఏఎన్ఎం ఆశ కలిసి పనిచేయాలని వారానికి ఒకసారి వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని తెలిపి ప్రజలకు ముఖ్యంగా డెంగ్యూ దోమల వలన వచ్చు పరిణామాలను వారికి వివరించాలని ప్రజల అవగాహన తీసుకురావాలని తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఎడ్యుకేషన్ఇవ్వాలని తెలిపారు మరి గ్రామాలలో 173 డెంగ్యూ కేసులు నమోదు అయినవని మలేరియా అధికారులను ఏం చేస్తున్నారో అని తగిన చర్యలు తీసుకోవాలని మలేరియా అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.