స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో 80 శాతం వైద్య సేవలు” అందుబాటులోకి…
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూల్ నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల యందు నెలకొల్పిన “స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్” యందు 80 శాతం వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె . చిట్టి నరసమ్మ , క్యాన్సర్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ కె. ప్రకాష్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాన్సర్ చికిత్సకు ఉపయోగించే అత్యాధునిక పరికరం “లీనాక్ మిషన్” కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఓపి సేవలు, ఇన్ పేషెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, మరికొన్ని ఆపరేషన్ థియేటర్ పరికరాలు రావాల్సి ఉందని అవి వచ్చిన వెంటనే త్వరలో ఆపరేషన్ థియేటర్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.