80 బన్నూరు సహకార సొసైటీ చైర్మన్ గా వైవీ రమణ
1 min read–అభినందనలు తెలిపిన న్యాయవాదులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జూపాడుబంగ్లా మండలం 80 బన్నూరు సహాకార సొసైటీ చైర్మన్ గా మండ్లెం మాజీ గ్రామ సర్పంచి వైవీ రమణ నియమితులైయ్యారు. ఈ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో శనివారం వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు కాటేపోగు నాగసురేష్ అధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులుమాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి వర్గీయులు వైవీ రమణ ను కలిసి శాలువా పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.వైసీపీ ప్రభుత్వం వైవీ రమణను చైర్మన్ పదవికి ఎంపిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నందికొట్కూరు న్యాయవాదులు వెంకట రాముడు, భాస్కర్ , రమేష్ లు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ,పుట్టల రాజేష్ ,యస్. సూర్యశివ, సురేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.