PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల 800మందికి లబ్ధి.. మంత్రి

1 min read

కోగిళతోట గ్రామంలో గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..

హోళగుంద మండల కేంద్రంలో సచివాలయం-3నూతన భవనము ప్రారంభించిన మంత్రి గుమ్మనూరు జయరాం..

జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల 800మందికి లబ్ధి పొందారు

కోగిళతోట గ్రామానికి వివిధ సంక్షేమ పథకాలు మొత్తం 10కోట్ల58లక్షలు లబ్ధి పొందారు

గ్రామంలో ఒక్క ఆర్.బి.కె ద్వారా రైతులకు 4కోట్ల 53లక్షలు లబ్ధిదారులకు మన ప్రభుత్వం మేలు చేసింది

గ్రామంలో 30లక్షలు సచివాలయం,మరియు మండల నిధులు ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

గ్రామ సచివాలయ వ్యవస్థ – దేశానికే ఆదర్శం

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు.:-

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : జగనన్న పాలనలోనే గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం  పేర్కొన్నారు. శనివారం హోళగుంద మండలం కోగిళతోట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రివర్యులకి నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తప్పెట్లు, శాలువా,బాణసంచా పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి గ్రామ సచివాలయ సేవలను గూర్చి ఆరా తీశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు పేర్కొన్నారు. శనివారం హోలగుంద మండలం గ్రామ సచివాలయం -3 ను పైలాన్ ను ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఈ సందర్భంగా గ్రామంలో మాట్లాడుతూ…దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉంటాయి.పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్టీరు రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై ఉండదు.ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకునే విధంగా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.మంత్రివర్యులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కోగిళతోట గ్రామంలో  సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.10 కోట్ల 58 లక్షలు అర్హులైన వారకి లబ్ధి చేకూరిందన్నారు. గ్రామ సచివాలయం నిధులతో  మౌలిక సదుపాయాల కొరకు డ్రైనేజీ, రోడ్లు, పనులు కొరకు ప్రణాళికలు సిద్ధంచేసిపనులు ప్రారంభించాలన్నారు. గ్రామంలో నీటి సంపు కోసం ప్రతిపాదనలు  సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు,గ్రామ సర్పంచ్ తనయుడు నాగప్ప, ఎంపీపీ తనయుడు ఈషా,జడ్పీటీసీ బావ శేషాప్ప,ఎంపీటీసీ రమేష్,మండల కన్వీనర్ షఫీ,గ్రామ సచివాలయం కన్వీనర్ షఫీ, నాయకులు సత్యనారాయణ రెడ్డి,రాముడు, మాజీ జడ్పీటీసీ రాంభీం నాయుడు,సచివాలయం సిబ్బంది,నాయకులు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author