జిల్లాల్లో 81 కుష్టు వ్యాధి కేసుల నిర్ధారణ
1 min read– అడిషనల్ డీఎంహెచ్ వో శారదాబాయి.
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా జూన్ 26 నుంచి జులై 30వరకు జరిపిన సర్వేలో 53కుష్టు వ్యాధి కేసులు నిర్ధారణ అయ్యాయని, ఏప్రిల్, మే నెలల్లో 28కేసులు నిర్ధారణ అయ్యాయని జిల్లా అడిషనల్ డీఎంహెచ్ వో శారదాబాయి తెలియజేశారు. చాగలమర్రి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 81కుష్టు వ్యాధి కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాల్లో సర్వేలో నిర్ధారణ అయిన కుష్టువ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు ప్రారంభిస్తున్నామని వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. కార్యక్రమంలో డీపీఎంవో ప్రసాదు, వైద్యురాలు అంజలి, హెల్త్ సూపర్‌వైజర్ రామలింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.