ఘనంగా 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం..
1 min read– ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచుకోవాలి..
– ఆయుర్వేద వైద్యంతోనే దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కారం..వైద్యాధికారి కె ఎల్ సుభద్రభ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆయుర్వేద వైద్యవిధానం పట్లప్రతిఒక్కరు అవగాహనకలిగిఉండాలని సీనియర్ వైద్యాధికారి డా:కెఎల్ సుభధ్ర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక అశోకవర్ధన స్కూల్లో ధన్వంతరి జయంతోత్సవాలలో భాగంగా 8వ జాతీయ ఆయుర్వేదదినోత్సవాన్ని ఏలూరుప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలఆధ్వర్యంలో నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలలో భాగంగా మెరుగైన జీవనశైలివిధానము దినచర్య ఋతుచర్య ఆయుర్వేద వైద్యంప్రాముఖ్యత మనపరిసరాల్లో లభించే ఔషధమొక్కలు వాటి వినియోగంపై విద్యార్థులకు ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహనకల్పించారు. వివిధప్రాంతాలలో వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో డా.కె లక్ష్మీ సుభధ్ర సిబ్బంది లక్ష్మి రేణుక తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు.