పెట్టింది 90 కోట్లు.. వచ్చింది 5 కోట్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం ధాకడ్
. రజ్నీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ మే 20న గ్రాండ్గా విడుదలైంది. సినిమా టీజర్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పింది. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఎనిమిదో రోజైన రెండో శుక్రవారం దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో రూ. 4,420 మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది. ఈ మూవీకి మొత్తం బడ్జెట్ రూ. 90 కోట్లు. ఇప్పటివరకు ధాకడ్ నమోదు చేసిన షేర్ రూ. 5 కోట్లలోపే అని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే కంగనా మూవీకి వచ్చిన నష్టం రూ. 85 కోట్లకు పైమాటే. దీంతో ఈ సినిమా అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఆ నష్టాన్ని భర్తీ చేలేదని బీటౌన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.