ఒకేసారి 900 మంది ఉద్యోగులు తొలగింపు.. !
1 min readపల్లెవెలుగు వెబ్ :అమెరికాకు చెందిన హౌసింగ్ లోన్, తనఖా సంస్థ బెటర్.కామ్. ఈ సంస్థ సీఈవో విశాల్ గార్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి జూమ్ కాల్ లో 900 మంది ఉద్యోగులను తొలగించారు. మార్కెట్, సమర్థత, పనితీరు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కంపెనీలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రోజుకు 8 గంటలు పనిచేయాల్సిన చోట.. కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు. గతంలో కూడ ఇదే స్థాయిలో విశాల్ గార్గ్ తమ ఉద్యోగుల్ని తొలగించారు. కంపెనీకి చెందిన ఈక్విటీ, డైవర్సిటీ, ఇంక్లూజన్ కు విభాగాలకు సంబంధించిన ఉద్యోగులను ఆయన తొలగించారు.