PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిమిషానికి 9000 ఫుడ్ ఆర్డ‌ర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొత్త సంవ‌త్స‌రం వేళ ఫుడ్ డెలివ‌రీ యాప్ ల పంట పండింది. డిసెంబ‌ర్ 31 రాత్రి నిమిషానికి 9000 ఫుడ్ ఆర్డ‌ర్లు స్విగ్గీకి వ‌చ్చిన‌ట్టు, జొమాటోకు నిమిషానికి 8 వేల ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌మ‌కు 20 ల‌క్ష‌ల ఫుడ్ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు స్విగ్గీ తెలిపింది. ఫుడ్ ఆర్డర్లలో గతేడాది సాధించిన సొంత రికార్డును బద్దలుకొట్టినట్లు తెలిపింది. గతేడాది న్యూఇయర్‌ సందర్భంగా స్విగ్గీకి నిమిషానికి 5500 ఆర్డర్లు రాగా.. ఈ ఏడాది ఏకంగా 9049 ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. ఇక నిమిషానికి 1229 బిర్యానీలను డెలివరీ చేసినట్లు తెలిపింది. స్విగ్గీలో చికెన్‌ బిర్యానీ, బటర్‌ నాన్‌, మసాలా దోశ, పన్నీర్‌ బటర్‌ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్‌కు అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు చెప్పింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కూడా నిన్న రాత్రి మంచి గిరాకీ వచ్చింద‌ని తెలుస్తోంది.

                                              

About Author