97 శాతం మంది తీవ్ర పేదరికంలోకి… !
1 min readపల్లెవెలుగు వెబ్ : తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థికంగా రోజురోజుకూ దిగజారిపోతోంది. ఆప్ఘనిస్థాన్ లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల్ని బయటపడేసే చర్యలు తీసుకోకపోతే 2022 నాటికి ఆ దేశంలో 97 శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ఆప్ఘనిస్థాన్ లోని 30 శాతం ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క పూట తిండికి కూడ ఇబ్బందిపడుతున్నారని ఐరాస ఇటీవల పేర్కొంది. ఇప్పటికే కరువు, కరోన తో అల్లాడుతున్న ఆప్ఘన్ కు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ ను ఆదుకునేందుకు ఐరాస ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వార అత్యవసర సేవలు, స్థానిక కుటుంబాలకు కనీస ఆదాయం చేకూరేలా ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపింది.