కర్నూలు మెయిన్ బజార్ పేట శ్రీ రామాలయం లో 98వ బ్రహ్మోత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని మెయిన్ బజార్ పేట శ్రీ రామాలయం లో 98వ బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీ నుండి ప్రారంభమై 7 రోజులు అనగా 12 వ తేదీ వరకు కొనసాగుతాయి. ఏడు రోజులు ప్రతిరోజు ఉదయం శ్రీ ఏకాంత సీతారాముల వారికి ఉదయమే సుప్రభాత సేవ, పంచామృతము, దివ్యాలంకారాలతో, పాంచరాత్రాగమంతో హోమాలు, సాయంత్రం రోజు శ్రీ సీతారామ లక్ష్మణ స్వాములు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంతో పురవీధుల్లో ఊరేగి, పిమ్మట ఊంజల సేవలో పాల్గొంటారు. ఈ ఏడు రోజులు అఖిలభారత మాధ్వ మహా మండల్ మరియు శ్రీరామ భక్తమండలి సౌజన్యంతో ఉదయం పండిత శ్రీ విద్యానిధి ఆచార్యులచే మహాభారత తాత్పర్య నిర్ణయం సాయంకాలం పండిత శ్రీ గోవర్ధనాచార్యులచే శ్రీమద్రామాయణ ప్రవచనాలు తెలుగులో ఏర్పాటు చేయబడింది. తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రత్యేకంగా కర్ణాటక ప్రముఖ కళాకారులచే భక్తి సంగీత విభావరి ఉండగలదు .10వ తేదీ సోమవారం ఉదయం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సాయంకాలం గడియారం ఆసుపత్రి దగ్గర గల నూతన స్వర్ణాలంకారరథం లో రథోత్సవము ఉండగలదు. పై అన్ని కార్యక్రమాల్లో విశేషంగా భక్తాదులు పాల్గొని తరించాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ దినేష్ గారు ఆలయ అర్చకుల తండ్రి శ్రీ మాళిగి హనుశాచార్యులు గారు కోరుతున్నారు.