NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

10లో అత్యుత్తమ ఫలితాలు  సాదించిన ఏపీ మోడల్ స్కూల్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలలో పెద్దపాడు ఏపీ మోడల్ స్కూల్ ఒకటిగా నిలిచిందని ప్రిన్సిపాల్ ఈరన్న రావు  మరియు విద్యా కమిటీ చైర్మన్ మధు నరసింహులు తెలిపారు. పాఠశాల నుండి 100 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 94 మంది ఉత్తీర్ణత సాధించి 94% ఫలితాన్ని నమోదు చేశారు.ఈ పాఠశాల నుంచి కే. భాను ప్రకాష్ 585 మార్కులు, డి. మనోజ్ కుమార్ 583 మార్కులు, డి. చానస్య 582 మార్కులు సాధించి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులుగా నిలిచారు.ఈ విజయానికి కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా కమిటీ చైర్మన్ మధు నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు.

About Author