అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు
1 min readపల్లెవెలుగు వెబ్ : నూతన విద్యావిధానం పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం ప్రకారం పీపీ-1 నుంచి 12 వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అదనపు పాఠశాలలు అవసరం అవుతాయి. కొత్త విద్యావిధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడ ఉండాలని సూచించారు. వర్గీకరణతో విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడతారని సీఎం వివరించారు. ఈ విధానం ద్వార ఉపాధ్యాయులకు పనిభారం తగ్గుతుందన్నారు. అర్హతలున్న అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తామని సీఎం తెలిపారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించారు. కొత్త విద్యా విధానం , నాడు-నేడు కార్యక్రమాలకు 16 వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.