మాస్కు ధరించకుంటే.. జరిమాన తప్పదు
1 min readపల్లెవెలుగువెబ్, చిట్వేలి: మండలకేంద్రమైన చిట్వేలి గ్రామ పంచాయితిపరిధిలో మాస్కులు ధరించకుండా తిరిగితే అపరాద రుసుం వసూలు చేస్తామన్నారు పంచాయితీ ఉపసర్పంచ్ చౌడవరం మహేశ్వరరెడ్డి. జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారికి100రూపాయిలు, మాస్కులు ధరించకుండా దుకాణాలను నిర్వహించేవారిపై రూ.10 వేల నుంచి రూ. 20వేలు జరిమానా విధిస్తామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకునే దుకాణాలను 15 రోజులు మూసివేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కరోన వైరస్ థర్డ్ వేవ్ నియంత్రణలో భాగంగా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.