NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం

1 min read

నిజమైన స్నేహం-మేలు చేసిన మతిమరుపు” కథలను  విద్యార్థులచే పఠనం

యోగా టీచర్ చేత యోగా  నేర్పించడం

గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా  సోమవారం విద్యార్థిని విద్యార్థులకు  యోగ టీచర్  దత్తి రేణుక ఎల్లమ్మ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర విపులంగా తెలియపరచి, ప్రకాశం  1872 లో వారి మేనమామ ఇంట జన్మించినారని, ప్రకాశం జిల్లాలోని టంగుటూరు ఆయన ఊరు,అదే ఆయన ఇంటి పేరు,బారిష్టర్ చదవాలనుకున్నారు.కష్టపడి చదివి సాధించారు.అనేక స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారు.ఎక్కడ అపజయం అన్నది ఎరుగరు ప్రకాశం అన్న పేరును సార్ధకం చేసుకున్నారు.ఎల్లప్పుడూ ప్రకాశించుతూనే ఉన్నారు.టంగుటూరు ప్రకాశం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పని చేశారని కొనియాడారు. అనంతరం రిసోర్స్ పర్సన్స్ కె. పూర్ణ కుమారి,వి.విజయలక్ష్మి  పెండెం జగదీశ్వర్ రచించిన ఉపాయం అనే పుస్తకంలోని “నిజమైన స్నేహం-మేలు చేసిన మతిమరుపు” అనే కథలను  విద్యార్థులచే చదివించడం,పుస్తక పఠనం చేయించడం జరిగినది. తర్వాత యోగా టీచర్ చేత యోగా గురించి విపులంగా వివరించి యోగ నేర్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు,విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనినారు. ఈ కార్యక్రమం అంతయు  గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు  ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది.పాల్గొనిన విద్యార్థిని,విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టడం జరిగినదని తెలియజేశారు.

About Author