సీఎం చేతుల మీదుగా ముల్లా మోయిన్‌కు సర్టిఫికెట్ అందజేత
1 min read
యువత సేవలకు గుర్తింపు – ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం పిలుపు
హోళగుందన్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుయువ నాయకుడు ముల్లా మోయిన్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. యువత సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువతే సమాజానికి బలమని, వారి శక్తి, ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. యువత ముందుకు వస్తేనే ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ముల్లా మోయిన్ వంటి యువకులు సమాజ సేవలో ముందుండటం అభినందనీయమని, మరింత మంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సీఎం కోరారు. యువతే రేపటి నాయకులని, వారి కృషితో బలమైన రాష్ట్ర నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.

