ఆఫీస్ సభార్డినేట్ గా పని చేస్తున్న కాట్రగడ్డ వరప్రకాష్ కు జూనియర్ అసిస్టెంట్ పదోన్నతి
1 min read
నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ ఉత్తర్వులు అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆఫీస్ సభార్డినేట్ గా పని చేస్తున్న కాట్రగడ్డ వరప్రకాష్ కు జూనియర్ అసిస్టెంట్ పదోన్నతి కల్పిస్తూ నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, కమిషనర్ ఏ.భాను ప్రతాప్ శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి అంటే బాధ్యత మరింత పెరిగిందని అర్థం చేసుకొని, కష్టపడి పని చేసి అందరికీ సహాయకారిగా ఉంటూ పలువురికి సేవలందించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్వకొల్లు సాంబ,బత్తిన విజయకుమార్,దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

