తల్లి ముర్రుపాలు అమృతంతో సమానం..
1 min readకమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రెడ్డమ్మ
పల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: పుట్టిన బిడ్డకు ముర్రుపాలు అమృతముతో సమానమని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రెడ్డమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ లు తెలిపారు. చాగలమర్రి పట్టణంలోని 17వ అంగన్వాడీ కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రెడ్డమ్మ ఆధ్వర్యంలో, ఆరవ అంగన్వాడీ కేంద్రంలో హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బాలింతలకు గర్భవతులకు తల్లిపాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలు పట్టించాలి అన్నారు. దీంతో పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఆరు నెలలు నిండిన చిన్నారులకు తల్లిపాలతో పాటు అంగన్వాడీ కేంద్రంలో అందించే అనుబంధ పోషణ ఆహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు చంద్రకళ, రజిని, బాలా కుల్ల యమ్మ, ఆరోగ్య కార్యకర్తలు మాధవి, లీలావతి, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, జగదీశ్వరి, అంగన్వాడి సహాయకులు సుజాత ,పద్మావతి, ఆశా కార్యకర్తలు సుబ్బలక్ష్మి, సలోమి ,శివలక్ష్మి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.