పురుషుల కోసం కుటుంబ నియంత్రణ మాత్ర !
1 min readపల్లెవెలుగు వెబ్ : పురుషుల కోసం త్వరలో కుటుంబ నియంత్రణ మాత్ర అందుబాటులోకి రానుంది. కండోమ్ అభివృద్ధి తర్వాత పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలేవి రూపొందలేదని స్కాట్ లాండ్ లోని దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త క్రిస్ బారాట్ తెలిపారు. ఫలితంగా అవాంఛిత గర్భాల నుంచి రక్షణ భారం ఎక్కువగా మహిళల పై పడుతోందని అన్నారు. ఈ అసమానత్వాన్ని తాము సరిచేయాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రెండేళ్లలోగా సరైన మాత్రను కనుగొని.. మొదటి దశ ప్రయోగాల దశకు చేరుకుంటామని ఆయన చెప్పారు.