PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిల్కీ బ్యూటీ ‘మాస్టర్‌‌ చెఫ్’ గా..

1 min read
మిల్కీబ్యూటీ తమన్నా భాటియా సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గని తన గ్లామర్‌‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా.. ఇటీవల ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయింది. లెవన్త్‌ అవర్, నవంబర్ స్టోరీస్ వంటి వెబ్ సీరీస్ లలో నటించి ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మిల్కీ బ్యూటీ బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయింది. విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన 'మాస్టర్ చెఫ్' అనే వంటల ప్రోగ్రామ్ 'మాస్టర్ చెఫ్' ప్రోగ్రామ్ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ షో తెలుగు వెర్షన్ కు తమన్నా హోస్ట్ గా చేస్తున్నారు. తమిళ్ లో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్.. కన్నడలో కిచ్చ సుదీప్ ఈ వంటల షో కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ షో ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో హాట్ లుక్‌లో దర్శనమిచ్చిన తమన్నా మాట్లాడుతూ.. తెలుగు భాషలో ఓ గొప్పదనం ఉంటుందని.. తెలుగు వంటల్లో ఓ కమ్మదనం ఉంటుందని చెప్పుకొచ్చింది. ''ఎక్కడికి వెళ్లినా మన రాయలసీమ రుచుల్ని కోస్తా పులుసుల్ని తెలంగాణ దావత్‌లను మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి తెలుగు వంటల్ని మన తెలుగు వారందరితో కలిసి ప్రపంచమంతా గుర్తించేలా సెలబ్రేట్ చేసుకునేందుకు సరైన వేదిక మాస్టర్ చెఫ్'' అని తమన్నా ఈ ప్రోమోలో చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఈ స్టార్ హీరోయిన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటోదని టాక్.

సినిమా డెస్క్​ : మిల్కీబ్యూటీ తమన్నా భాటియా సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గని తన గ్లామర్‌‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా.. ఇటీవల ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయింది. లెవన్త్‌ అవర్, నవంబర్ స్టోరీస్ వంటి వెబ్ సీరీస్ లలో నటించి ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మిల్కీ బ్యూటీ బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయింది.
విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ‘మాస్టర్ చెఫ్’ అనే వంటల ప్రోగ్రామ్ ‘మాస్టర్ చెఫ్’ ప్రోగ్రామ్ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ షో తెలుగు వెర్షన్ కు తమన్నా హోస్ట్ గా చేస్తున్నారు. తమిళ్ లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్.. కన్నడలో కిచ్చ సుదీప్ ఈ వంటల షో కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ షో ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో హాట్ లుక్‌లో దర్శనమిచ్చిన తమన్నా మాట్లాడుతూ.. తెలుగు భాషలో ఓ గొప్పదనం ఉంటుందని.. తెలుగు వంటల్లో ఓ కమ్మదనం ఉంటుందని చెప్పుకొచ్చింది.

”ఎక్కడికి వెళ్లినా మన రాయలసీమ రుచుల్ని కోస్తా పులుసుల్ని తెలంగాణ దావత్‌లను మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి తెలుగు వంటల్ని మన తెలుగు వారందరితో కలిసి ప్రపంచమంతా గుర్తించేలా సెలబ్రేట్ చేసుకునేందుకు సరైన వేదిక మాస్టర్ చెఫ్” అని తమన్నా ఈ ప్రోమోలో చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఈ స్టార్ హీరోయిన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటోదని టాక్.

About Author