PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగాస్టార్ చెల్లి..

1 min read
మెగాస్టార్ చెల్లి..

సినిమా డెస్క్​ : మెగాస్టార్‌‌ చిరంజీవి తన ‘ఆచార్య’ సినిమా తర్వాత మలయాళ ‘లూసిఫర్’ తోపాటు తమిళ ‘వేదాళం’ చిత్ర రీమేక్‌లను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇది సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. మెహర్ ఈ స్క్రిప్ట్ మీద దాదాపు మూడేళ్ళుగా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో చిరు సోదరి పాత్రలో నటించే హీరోయిన్ గురించి చర్చలు జరిగాయి. అందులోను సాయి పల్లవి, – కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కీర్తి సురేష్ అయితేనే మెగాస్టార్ సిస్టర్ రోల్ కి బాగుంటుందని భావించిన మెహర్ రమేష్.. ఆమెను ఒప్పించడానికి ట్రై చేసి చివరకు ఒప్పించగలిగారని టాలీవుడ్‌ టాక్‌. దీని కోసం కీర్తి కూడా భారీ రెమ్యూనరేషన్ అందుకోనుందని అంటున్నారు. ఒరిజినల్‌  వెర్సన్ లో అజిత్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తే.. చెల్లెలుగా లక్ష్మీ మీనన్ కనిపించింది. ఇప్పుడు మెగా రీమేక్ లో లక్ష్మీ మీనన్ పాత్రలో కీర్తి కనిపించనుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కీర్తి సురేష్ ఇప్పటికే ‘అన్నాత్తే’ చిత్రంలో రజినీకాంత్ కూతురిగా నటిస్తోందని టాక్ నడుస్తోంది. ఇక తెలుగులో మహేష్ బాబు – పరశురామ్ పెట్లా కాంబోలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కీర్తి హీరోయిన్ గా చేస్తోంది.

About Author