25న జిల్లాస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ జట్టు ఎంపికలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 25న సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.స్థానిక డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. జనవరి 1, 2006 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే పాల్గొనడానికి అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు.ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల 27 నుంచి 29 వరకు విజయనగరం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు.

