PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమితాబ్‌తో మొదటి ఎక్స్‌పీరియన్స్‌..

1 min read

సినిమా డెస్క్​ : టాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్ హీరోయిన్స్‌ రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. మొదటి సినిమా అమితాబచ్చన్ తో కలిసి ‘గుడ్‌ బై’ లో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. బిగ్ బి అమితాబ్ తో నటించడం అంటే ఎవరికైనా ఛాలెంజింగ్ విషయం. క్వీన్, సూపర్ 30 వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ ప్రస్తుతం అమితాబ్ మరియు రష్మికలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సందర్బంగా అమితాబచ్చన్ తో రష్మిక తన మొదటి రోజు ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
రష్మిక షూటింగ్ లో తన సోలో పోర్షన్ ను ముగించాక అమితాబచ్చన్ తో సన్నివేశాలు చేయాల్సిన సమయం వచ్చిందట. ముందు రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత అలాగే ఉండి దర్శకుడు వికాస్ తో రేపటి సన్నివేశాల గురించి మరోసారి ఎక్స్ ప్లైన్ చేయించుకుని వాటిని అమితాబచ్చన్ గారితో ఎలా చేయాలా అనేది చర్చించి మరీ ప్రాక్టీస్ చేసిందట. దర్శకుడు చెప్పిన.. సూచించిన పలు విషయాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి రోజు అయిన ఫస్ట్ డే షూట్ లో రష్మిక పాల్గొన్నదట. ఆ సమయంలో బిగ్ బి చాలా కూల్ గా సింపుల్ గా నటించేశారట.
ఆయనతో నటిస్తున్న సమయంలో పూర్తిగా పాత్రలో లీనం అవ్వడం వల్ల ఆయనతో కాకుండా పాత్రలు రెండు నటిస్తున్నట్లుగా అనిపించింది. అంతకు మించి ఆయన నుండి ఎలాంటి ఆందోళన రాకు ఎదురు కాలేదని.. ఆయనతో నటించడాన్ని జీవితాంతం మర్చిపోలేని విషయం అన్నట్లుగా రష్మిక సంబంరంగా చెప్పుకొచ్చింది.

About Author