మహిళలు.. అవకాశాలను సృష్టించుకోవాలి
1 min read– కేవీఆర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వసుంధర
పల్లెవెలుగు, కర్నూలు
మహిళలు అవకాశాలను సృష్టించుకుంటే.. ఏ రంగంలోనైనా రాణించవచ్చని కేవీఆర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వసుంధర అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నగరంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కార్యాలయంలో బ్యాంకు రీజనల్ మేనేజర్ పి. ఓబయ్య అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి పిరమిడ్ మెడిటేషన్ మాస్టర్లత, రవీంద్ర స్కూల్ టీచర్ ధనలక్ష్మి ముఖ్య అతిథిలుగా విచ్చేశారు. కార్యక్రమానికి ముందు కేక్ కట్ చేసి… మహిళలు, బ్యాంకు సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేవీఆర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వసుంధర మాట్లాడుతూ మహిళలు రాజకీయం, సామాజికం, ఆర్థికంగా రాణించాలని, అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్నారు. మహిళా సాధికారితతోనే.. కుటుంబమైనా.. దేశమైనా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అనంతరం బ్యాంకు రీజనల్ మేనేజర్ పి. ఓబయ్య నేతృత్వంలో మహిళలను సన్మానించారు. కార్యక్రమంలోబ్యాంకు సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు.