రెడ్లంటే కోపమా.. ఆ వర్గం నీకేం ద్రోహం చేసింది ?
1 min readపల్లెవెలుగు వెబ్ : గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన చేరెడ్డి జనార్ధన్ ను సీఐడీ ప్రాంతీయ కార్యాలయ పోలీసులు శనివారం విచారించారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను షేర్ చేస్తున్నందుకు గాను చేరెడ్డి జనార్ధన్ కు సీఐడీ నోటీసులు అందించింది. చేరెడ్డి జనార్ధన్, భార్య ఝాన్సీతో కలిసి సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. భార్యను బయటికి పంపి జనార్దన్ ను మాత్రమే సీఐడీ పోలీసులు విచారించారు. ` నీకు రెడ్లంటే కోపమా ?. ఆ వర్గం నీకేం ద్రోహం చేసింది ?. సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు ఎందుకు పెడుతున్నారు?. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి ?. ఇలా పెట్టమని ఎవరైన ప్రోత్సహిస్తున్నారా?. వారెవరు ? అంటూ సీఐడీ అధికారులు జనార్ధన్ ను ప్రశ్నించారు. అనంతరం రాత్రి 7:30 నిమిషాలకు సొంతపూచీకత్తుతో జనార్ధన్ ను వదిలిపెట్టారని, మరోసారి ఇలాంటి పనులు చేస్తే లోపలేస్తామని చెప్పినట్టు చేరెడ్డి జనార్ధన్ తెలిపారు.