PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపర్‌‌ కింగ్‌

1 min read

సినిమా డెస్క్ : కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ కు మంచి వ్యూసే వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నాగార్జున ఎన్‌ఐఏ కమెండో పాత్రలో అదరగొట్టారన్న ప్రశంసలు కూడా దక్కాయి. అందుకే ఆయన సాహసాల బాటను విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం జాతీయ అవార్డ్ ఫిలింమేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించనుంది. నాగ్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో చూడనున్నారు అభిమానులు. తాజాగా సెట్స్ నుంచి నాగార్జున ఫోటోలు సోషల్ మీడియాల్లో విడుదలయ్యాయి. మేకర్స్ ఈ ఏడాది చివరినాటికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభమైంది. నాగార్జునతో కాజల్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రాన్ని నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్- రామ్ మోహన్ రావు -శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

About Author