సీఐ పై దాడి.. గోప్యంగా కేసు ?
1 min readపల్లెవెలుగు వెబ్ : సైబరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి రేంజ్ రోవర్ కారు దూసుకొస్తుండటంతో కారును ఆపబోయారు. కారు ఆపకుండా రివర్స్ వెళ్లడం గమనించి.. వాహనాలు అడ్డుపెట్టి ఆపారు. కారులోని ఇద్దరు బ్రీత్ అనలైజర్ పరీక్షలకు నిరాకరించారు. పైగా ‘మమ్మల్నే ఆపుతారా ?. మీరెంత ?. మీ చదువులెంత ? అంటూ.. ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారను పడతాయి’ అంటూ బెదిరించారు. దీంతో అక్కడికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పై దాడికి దిగారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ పెదవి పగిలేలా కొట్టారు. తన పై దాడి చేసిన వారి పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కానీ సీఐ పై దాడి చేసిన వ్యక్తి నగరంలోని ఓ ఉన్నతస్థాయి పోలీస్ అధికారికి బంధువు కావడంతో కేసును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.