NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫుడ్ చైర్మన్ రాకతో..అధికారుల్లో దడ

1 min read

భోజనంలోనూ మేయాలని చూస్తే సహించేది లేదు

భోజనం నాణ్యతగా ఉండాలి

అక్రమాలు జరిగితే సుమోటో కేసులు నమోదు

హాస్టళ్లు,అంగన్వాడీ,గురుకులం,పాఠశాలల ఆకస్మిక తనిఖీ

రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి..

నందికొట్కూరు న్యూస్ నేడు: పేద విద్యార్థులకు వడ్డించే భోజనంలోనూ మేయాలని దోచుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. నందికొట్కూరులో పలు హాస్టళ్లు,పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో దడ పుట్టించారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్..శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఎస్సీ,బిసి బాల బాలికల 4 హాస్టళ్లను తనిఖీ చేయడం ప్రారంభించారు.తర్వాత లక్ష్మాపురం అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల,పగిడ్యాలలో కేజీబీవీ,మోడల్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, నందికొట్కూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ లో సివిల్ సప్లై గోడౌన్,కోటా జిల్లా పరిషత్,రేషన్ దుకాణాలు,సిఎస్ఐ ఉన్నత పాఠశాల,జడ్పీ బాలికల పాఠశాల మరియు మిడుతూరు మండలం తలముడిపి మొదటి అంగన్వాడీ కేంద్రం,ఎంపీపీ స్పెషల్ పాఠశాలను ఫుడ్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా హాస్టళ్లు,అంగన్వాడీ కేంద్రాలు,పాఠశాలలపై ఫిర్యాదులు రావడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైర్మన్ ఆకస్మిక తనిఖీలతో అధికారుల్లో దడ

ఉ 6:30 నుండి మ 3 గం.ల వరకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చేపట్టిన ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో దడ పుట్టించారు. విద్యార్థులు మరియు స్టాఫ్ రిజిస్టర్లు,భోజనం మెటీరియల్ స్టాక్ ఎంత ఉందనే వాటిపై రిజిస్టర్లు తనిఖీ చేశారు.పేద విద్యార్థుల కోసం ఎంతో ఖర్చు చేస్తుంటే నాణ్యతలేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు.ఆహారంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.విద్యార్థుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి భోజనం నాణ్యత,మెనూ పెంచాలి పేద పిల్లల అన్నంలో కక్కుర్తి పడొద్దు లంచాలకు ఆశపడకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి స్టోర్ వంట గదులను పరిశీలించారు. గుడ్లు నాణ్యతగా లేకపోతే వెనక్కి పంపాలన్నారు. ఎంఈవో లు సమన్వయంతో పని చేయాలన్నారు.

అక్రమాలు జరిగితే సుమోటో కేసులు

విద్యార్థుల భోజన విషయంలో అక్రమాలు జరిగినట్లు తేలితే సుమోటో కేసులు నమోదు,జరిమాన, సస్పెన్షన్ కు సిఫారసు చేసే అధికారాలు కమిషన్ కు ఉన్నాయని హెచ్చరించారు. లక్ష్మాపురం గురుకుల పాఠశాలలో భోజనములో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చైర్మన్ దృష్టికి తీసుకురాగా చైర్మన్ పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అవసరం మేరకే స్టాక్ తెప్పించుకోవాలని పాఠశాలలకు సెలవులు ఉన్నప్పుడు స్టాక్ తక్కువగా తెప్పించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటరాముడు,ఎంఈఓ లు,అధికారులు పాల్గొన్నారు.

About Author