అధిక లోడుతో వెళ్తున్న ఆటోను నిలిపివేసి డ్రైవర్‌కు కౌన్సిలింగ్
1 min read
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు … కర్నూలు తాలూకా సీఐ శ్రీ తేజమూర్తి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో రహదారి భద్రతపై ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను కర్నూలు తాలూకా సీఐ శ్రీ తేజమూర్తి గుర్తించి నిలిపివేశారు.అనంతరం ఆటోలో ఉన్న అదనపు ప్రయాణికులను సురక్షితంగా దింపించి, ఆటో డ్రైవర్‌కు , ప్రయాణికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ శ్రీ తేజమూర్తి మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు.అలాగే మోటారు వాహనాల చట్టాలను తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక లోడుతో వాహనాలు నడిపే డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలందరూ రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


