NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదరసా ప్రారంభోత్సవంలో ఈబీజీ గోవింద్ గౌడ్‌కు ఘన ఆహ్వానం

1 min read

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలో రేపు (జూలై 5) నిర్వహించనున్న అల్ హిదాయా హిఫ్జుల్ ఖురాన్ అకాడమీ మదరసా ఘన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్, టీడీపీ యువ నాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్, టీడీపీ మైనారిటీ మండల అధ్యక్షుడు ముల్లా మొయిన్లను  షంషుద్దీన్ సఖాఫీ హఫీజ్ ఆధ్వర్యంలో దూదేకుల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మదరసాకు ఆశీర్వాదాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మత విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందించడంలో ఇటువంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో ఎం. హుస్సేన్ పీరా, కె.పీ. హుస్సేన్ పీరా, సులేమాన్ సాబ్, బడే సాబ్, సాయిబేష్, బాబానా, సిద్ధిక్ సాబ్, పీరన్నతో పాటు పలువురు దూదేకుల నాయకులు పాల్గొన్నారు.

About Author