స్వామి వివేకానంద 124 వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక నంద్యాల పట్టణ లో కల్పనా సెంటర్ వద్ద ఉన్న స్వామి వివేకానంద 124 వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయనను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ సహాయ కార్యదర్శి నడిగడ్డ మా భాష, నాయకులు షేక్ మా భాష, జమాల్ ,రమేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటికీ యువతకు చాలా ఆదర్శంగా ఉన్నారని ఆయన మరణించిన ఆయన ఆశయాలు మరణించలేదని నేటికీ యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతున్నారని అదేవిధంగా చదువులో కానీ విజ్ఞానంలో కానీ ఆయన చాలా ముందు ఉండేవారు కొద్ది క్షణంలోనే పది పేజీలు చదివేగల జ్ఞానవంతులు అలాగే ఆయన ప్రపంచ యువతను తన వాక్చాతుర్యంతో ఆకర్చించి యువతను సన్మార్గంలో నడిపించాడు అని, యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెడితే కష్టతరమైన విజయం సొంతం చేసుకోవచ్చని, కానీ యువలోకం చాలా వరకు చెడు అలవాట్లకు బానిసలై సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాజాన్ని సన్మార్గం నడిపించే ప్రయత్నం చేయాలని అని తెలిపారు.


