ఒలంపిక్స్ లోకి క్రికెట్ ?
1 min readపల్లెవెలుగు వెబ్ : ఒలంపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ఉండాలని కోరుకోని క్రీడాభిమాని ఉండరు. క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చడం అనేది క్రికెట్ ను ఆరాధించే ఎందరో భారతీయుల కల. ఆ కల త్వరలో నిజం కాబోయే అవకాశం కనిపిస్తోంది. అన్ని సక్రమంగా జరిగితే 2028 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లో ఆ కల నిజమవుతుంది. ఒలంపిక్స్ లో క్రికెట్ ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధంగా ఉన్నామంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలంపిక్స్ లో క్రికెట్ ను భాగం చేసేందుకు ఐసిసిఐ తో కలిపి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒలంపిక్స్ లో క్రికెట్ చేర్చాలన్న వాదనకు బీసీసీఐ గతంలో ఒప్పుకోలేదు. ప్రస్తుతం బీసీసీఐ ఇందుకు సానుకూలంగా ఉంది. దీంతో ఒలంపిక్స్ లో క్రికెట్ భాగం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.