NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘నీర‌జ్ ’ పేరు గ‌ల వారికి.. 500 పెట్రోల్ ఫ్రీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మీ పేరు నీర‌జ్ ఆ ?. అయితే మీకు 500 రూపాయ‌ల పెట్రోల్ ఫ్రీ. డ‌బ్బులు చెల్లించాల్సిన ప‌ని లేదు. కేవ‌లం మీ పేరు నీర‌జ్ అని రుజువు చేసుకుంటే చాలు. అవును. నీర‌జ్ అని పేరున్న వ్యక్తుల‌కు గుజ‌రాత్ లోని భ‌రూచ్ లో ఓ పెట్రోల్ బంక్ య‌జ‌మాని 501 రూపాయ‌ల పెట్రోల్ ఉచితంగా పోస్తున్నాడు. ఇటీవ‌ల ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో క్రీడ‌లో స్వర్ణం సాధించిన నీర‌జ్ చోప్రా విజ‌యానికి గుర్తుగా.. అభిమానంతో ఓ పెట్రోల్ బంక్ య‌జ‌మాని ఇంద‌తా చేస్తున్నాడు. అయితే నీర‌జ్ అనే పేరు రుజువు చేసుకునేందుకు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్రోల్ బంక్ లో ఇవ్వాల‌ని ష‌ర‌తు పెట్టాడు. దీంతో నీర‌జ్ పేరు ఉన్న వ్యక్తులు పెట్రోల్ బంక్ కు ఉచిత పెట్రోల్ కోసం వెళ్తున్నారు. ఆయ‌న ప్రక‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ గా మారింది.

About Author