NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుడిసె కృష్ణమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉద్యోగులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అనుకోకుండా కలెక్టర్ కాంప్లెక్స్ నందు వచ్చిన కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ ని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి.కాశన్న, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ఇంకా టీచర్ల ఉద్యోగులు మర్యాదపూర్వకంగా గుడిసె కృష్ణమ్మ ని కలవడం జరిగింది.ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర జేఏసీ చైర్మన్ కామ్రేడ్ ఆలపర్తి విద్యాసాగర్ , సెక్రటరీ జనరల్ ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ  పిలుపుమేరకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా MP/MLA ల కు ఏపీ జేఏసీ కర్నూలు జిల్లా పక్షాన ఉద్యోగుల డిమాండ్లపై మెమోరాండం ఇచ్చిన విషయం ఆమె దృష్టికి తేవడం జరిగింది.ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షురాలు మాట్లాడుతూ నేను కూడా మీ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ తో త్వరలో మీ డిమాండ్స్ పరిష్కారం కొరకు సమావేశం అవుతామనీ  తెలియజేయడం జరిగినది.అంతేకాకుండా ముఖ్యమంత్రి తో కూడా ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని తెలియజేయడం జరిగినది.

About Author