NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో కోట్రా/ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ప్రారంభించండి

1 min read

ఇన్వెస్ట్ కొరియా కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యుంగ్ తో మంత్రి లోకేష్ భేటీ

సియోల్ (సౌత్ కొరియా) న్యూస్​ నేడు  : ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యుంగ్ (Dr. Kim Tae Hyung (Hyung Kim)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. అమరావతి లేదా విశాఖపట్నంలో  ఒక ప్రత్యేక కోట్రా / ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని మంత్రి కోరారు. మెట్రో నగరాలు మినహా దక్షిణ భారతదేశంలో ఇది మొదటి ఉప-జాతీయ కోట్రా కార్యాలయం అవుతుంది. ఇది APEDBలో అంతర్భాగంగా ఉండే కోట్రా డెస్క్ నుండి పూర్తిస్థాయి కార్యాలయంగా దశలవారీగా అభివృద్ధి చెందుతుంది. దీనికి సియోల్‌లోని కోట్రా / ఇన్వెస్ట్ కొరియాకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ డెస్క్ పనిచేస్తుంది. దీనిద్వారా ఏపీఈడీబీ – కోట్రా నడుమ బలమైన బంధం ఏర్పాటై పరిశ్రమదారులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పెట్టుబడిదారుల అవసరాలు, కమ్యూనిటీ అవసరాలపై నాలెడ్జ్ పార్టనర్‌గా ఉమ్మడిగా ఒక ప్రత్యేక కొరియా ఇండస్ట్రియల్ పార్క్ / కొరియా క్లస్టర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. ఏపీలోని శ్రీసిటీ, విశాఖపట్నం, అనంతపురం/కియా ఎకోసిస్టమ్‌కు కొరియన్ వ్యాపార ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించండి. CII పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 (12–13 నవంబర్ 2026, AP)లో కొరియా సంస్థలు పెద్దఎత్తున హాజరయ్యేలా ప్రోత్సహించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

About Author