NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వీరభద్ర గౌడ్‌కు ఘన జన్మదిన శుభాకాంక్షలు

1 min read

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జనహృదయనేత – అభిమానుల ప్రశంసలు

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొన్న జనహృదయనేత, బడుగు–బలహీన వర్గాల ఆశాజ్యోతి వీరభద్ర గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిని ఎలాంటి కుట్రలు, రాజకీయ ద్రోహాలు శాశ్వతంగా అణచివేయలేవని అన్నారు. ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం దూరమైనప్పటికీ, ఆలూరు ప్రజల హృదయాల్లో వీరభద్ర గౌడ్ ఎప్పటికీ విజేతగానే నిలిచారని పేర్కొన్నారు.అధికారం కోసం కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడు వీరభద్ర గౌడ్ అని కొనియాడారు. పదవి లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు.”రాజు ఎక్కడ ఉన్నా రాజే” అన్నట్లుగా, ప్రజల ప్రేమే నిజమైన అధికారం అని, ఆ ప్రేమాభిమానాలను వీరభద్ర గౌడ్ ఇప్పటికే సంపాదించుకున్నారని అన్నారు. పదవులు శాశ్వతం కాకపోయినా, ప్రజల హృదయాల్లో సంపాదించిన స్థానం శాశ్వతమని అభిప్రాయపడ్డారు.వీరభద్ర గౌడ్ నిజాయితీ, నిబద్ధత, సేవా తపనకు తగిన గుర్తింపు లభించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి, పూలమాలలు వేసి, మిఠాయిలు పంచుకుంటూ జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. వీరభద్ర గౌడ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *