ఒలంపిక్స్ లో చేతిని కొరికాడు.. క్షమాపణ చెప్పాడు !
1 min readపల్లెవెలుగు వెబ్ : చేతి కండను కొరికినందుకు కజికిస్థాన్ రెజ్లర్ సనయేవ్ క్షమాపణ చెప్పాడని టోక్యో ఒలంపిక్స్ పతక విజేత రవి దహియా తెలిపారు. సెమీ ఫైనల్ బౌట్ ఆఖర్లో రవి దహియాకి చిక్కిన సనయేవ్ వెల్లకిలా పడే క్రమంలో గట్టిగా కొరికేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెజ్లింగ్ అంటేనే దూకుడుతో ఆడే ఆట అని, ఒక్కోసారి బాహాబాహికి దిగుతుంటారని తెలిపారు. సనయేవ తన చేతిని కొరికిన విషయాన్ని మర్చిపోయానని, ఆటలో ఇవన్నీ చాలా చిన్న విషయాలని తెలిపారు. తర్వాత సనయేవ్ కలిసి.. కౌగిలించుకుని , క్షమాపణ కోరాడని రవి తెలిపారు. తాను కూడ నవ్వి సనయేవ్ ను కౌగిలించుకున్నానని రవి చెప్పాడు.