పెదపాడు అగస్టిన్ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులతో అవగాహన సదస్సు
1 min read
పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అపోహ లను తొలగించి, పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం
పెదపాడు ఎస్‌ఐ ఆర్.శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ యొక్క ఆధ్వర్యం లో పెదవేగి ఇన్‌స్పెక్టర్ సిహెచ్.రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్‌ఐ ఆర్.శ్రీనివాస్ సిబ్బంది తో కలిసి పెదపాడు మండలం పెదపాడు అగస్టిన్ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులతో అవగాహన సదస్సు ను నిర్వహించరు.పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అపోహ లను తొలగించి, పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పెదపాడు పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగస్టిన్ హై స్కూల్ ప్రాంగణంలో ఎస్‌ఐ ఆర్. శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థుల తో మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ఏవైనా ఆపదల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణ సహాయం పొందేందుకు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ లపై గురించి అవగాహన కల్పించడం జరిగింది.డయల్ 112 ఇది దేశవ్యాప్త అత్యవసర సేవా నంబర్. ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు, అగ్నిమాపక దళం లేదా అంబులెన్స్ సహాయం కోసం దీనిని సంప్రదించలన్నరు.181 మహిళా హెల్ప్‌లైన్ ఇది మహిళల రక్షణ కోసం పనిచేస్తుంది. వేధింపులు లేదా గృహ హింస వంటి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు మరియు విద్యార్థినులు ఈ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు అన్నారు.1098 చైల్డ్ లైన్ ఇది పిల్లల కోసం ప్రత్యేకించిన నంబర్. బాలకార్మిక వ్యవస్థ, పిల్లలపై దాడులు లేదా ఇతర సమస్యలతో బాధపడే పిల్లలు ఈ నంబర్‌ను ఆశ్రయించవచ్చన్నారు.1930 సైబర్ క్రైమ్ ఎవరైనా గురైన సమయంలో వెంటనే పై నెంబర్కు కాల్ చేసిన యెడల సహాయ సహకారాలను అందిస్తారని, ఈ నంబర్లు కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా, పైన పేర్కొన్న నంబర్లకు డయల్ చేసి సమాచారం అందించడం ద్వారా తక్షణమే పోలీసుల సహాయం పొందవచ్చు అని,ప్రతి విద్యార్థి ఈ నెంబర్ లను తమ మొబైల్ ఫోన్లలో భద్రపరుచుకోవాలని మరియు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.ఈ కార్యక్రమము లో అగస్టిన్ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


