మార్ బర్గ్ వైరస్ తో మొదటి వ్యక్తి మృతి !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రపంచమంతా కరోన వైరస్ తో అల్లాడుతుంటే.. ఇప్పుడు మార్ బర్గ్ అనే వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలోని గేక్కౌడ్ ప్రాంతంలో దీనిని గుర్తించారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మార్ బర్గ్ వైరస్ తో ఆగస్టు 2న ఓ వ్యక్తి చనిపోయారు. ఈ వైరస్ సోకినప్పుడు వచ్చే జ్వరంతో రక్తనాళాలు చిట్లిపోతాయి. ఇది కూడ ఎబోలా జాతికి చెందిన వైరస్ కావడం గమనార్హం. గినియాలో ఎబోలాను కట్టడి చేయడానికి ఆరునెలల పాటు తీవ్రంగా శ్రమించారు. దాని ముప్పు తప్పిందన్న తరుణంలో ఈ వైరస్ భయటపడడం ఆందోళనకు గురిచేస్తోంది.